Heavy Rains : ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ నిండాయి. రిజర్వాయర్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. మహబూబాబాద్, సూర్యపేట జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలో చెరువులన్నీ నిండి అలుగులు పోస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పైకి నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. పాలేరు జలాశయం 23 అడుగులు ఉండగా నిండటంతో గేట్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. అదే విధంగా వైరా రిజర్వాయర్ కి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో రిజర్వాయర్ నిండింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 18 అడుగులు నిండగా అలుగుల నుంచి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు లో భారీగా నీరు చేరుకున్నాయి. ఈ వర్షాలు రైతులకి ఎంతో ప్రయోజన కరంగా ఉంది.
Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?
