NTV Telugu Site icon

Heavy Rains: మళ్లీ వర్షాలు.. మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..

Rains

Rains

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడిందంటే సెంటీమీటర్లలో ఉంటుంది.. ఈ మధ్య హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వానలు దంచికొట్టాయి.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. రేపటి నుంచి అంటే.. మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజు‌ల‌పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందంటున్నారు అధికారులు.. ఆంధ్రప్రదేశ్‌ తీరం‌లోని పశ్చిమ మధ్య బంగా‌ళా‌ఖా‌తంలోని ఆవ‌ర్తనం సము‌ద్రమ‌ట్టా‌నికి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు విస్తరించి.. నైరుతి దిశగా వంపు తిరిగి ఉందంటున్న వాతావరణం కేంద్రం… మరోవైపు, ఈశాన్య బంగా‌ళా‌ఖాతం పరి‌స‌రాల్లో ఏర్పడిన మరో ఆవ‌ర్తనం సము‌ద్రమ‌ట్టా‌నికి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు విస్తరించి ఉందని పేర్కొన్నారు.. వీటి ప్రభా‌వంతో మంగళవారం నుంచి మూడు రోజు‌ల‌పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. కాగా, వరుసగా దంచికొడుతోన్న వర్షాలతో.. తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఓ వైపు మందుల ఖర్చులు పెరిగిపోయాయని.. భారీ వర్షాలతో చేతికి వచ్చిన కూరగాలు, ఇతర పంటలతో నష్టం జరుగుతోందంటున్నారు.

Read Also: New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఇవి పాటించకపోతే బాదుడే బాదుడు..