NTV Telugu Site icon

Telangana Rains: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేవు. జూలై చివరి వారంలో వర్షాలు కురిసినా ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి జాడ లేదు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల. ప్రస్తుతం కాయలు ఎదుగుదల దశలో ఉన్నందున వర్షం అవసరం. అయితే రాష్ట్రంలో చాలా రోజులుగా పొడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో అడపాదడపా వర్షాలు తప్ప జిల్లాల్లో వరుణుడు పలకరించలేదు. దానికి తోడు ఎండల తీవ్రత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

Read also: Hyderabad Water: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. 2 రోజులు 30 ప్రాంతాల్లో నీళ్లు బంద్..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. ఈశాన్యానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 4.5 నుండి 7.6 కి.మీల మధ్య ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. పెరుగుతున్న ఆటుపోట్లు దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read also: Shankar: ఈయన కమర్షియల్ సినిమాలకి గేమ్ ఛేంజర్

ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కాకినాడ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈరోజు వర్షం కురుస్తుంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Sai Stotram: శ్రావణ గురువారం అభిషేకం వీక్షిస్తే ఇంట సుఖసంతోషాలు