NTV Telugu Site icon

Yellow Alert: మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Telangana Rains

Telangana Rains

Yellow Alert: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 5న మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. నేడు నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

Read also: Health Tips : ఒక ఆరోగ్య వంతుడైన మనిషి రోజుకు ఎన్ని సార్లు బాత్ రూంకు వెళ్తాడో తెలుసా ?

ఇక బుధవారం నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న గురువారం ఆదిలాబాద్, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Read also: Jasprit Bumrah: నా కెరీర్‌ ముగిసిందన్నారు: బుమ్రా

దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించిన విషయం తెలిసిందే. తగు జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎక్స్ ప్లాట్‌ఫారమ్ పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేసేందుకు వీలైతే మొబైల్/వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Show comments