NTV Telugu Site icon

TS Rain: తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Rain

Telangana Rain

TS Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, అస్మానాబాదు, నిర్మల్, నిర్మల్ , ఆదిలాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రేపు కూడా హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read also: Bike Romance: కదులుతున్న బైకుపై సరసాలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఈనెల 20 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 20వ తేదీన మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. . 21న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే 22న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నిన్న ములుగు జిల్లాలో 8.0, నిజామాబాద్ జిల్లాలో 7.7, ఆదిలాబాద్ జిల్లాలో 6.4, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.2, నిర్మల్ జిల్లాలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Adhika Sravana Masam: అధిక శ్రావణమాసం ఈ స్తోత్రాలు వింటే విశేష ఫలం దక్కుతుంది