NTV Telugu Site icon

IMD Weather: తెలుగు రాష్ట్రాలకు కీలక అప్డేట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..

Heavy Rains

Heavy Rains

IMD Weather: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంటుందని వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున పూరి, చిలుక లేక మధ్య వాయుగుండం తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Read also: Komatireddy Venkat Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది..

తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఏపీ విషయానికి వస్తే.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, నెల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదా? సండ్ర సీరియస్‌