Site icon NTV Telugu

Adilabad Heavy Rains continue: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మళ్ళీ వరద పంజా

Adb Varada 1

Adb Varada 1

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి..ఆదిలాబాద్ ,నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి..మరీ ముఖ్యంగా నిర్మల్ జిల్లా బాసరలో వర్షం భీభత్సం సృష్టించింది..రైల్వే స్టేషన్ పరిసరాలతోపాటు బాసరలోని రోడ్ల పై వరద ఉప్పొంగి ప్రవహించింది…అమ్మవారి కళ్యాణ మండలం ఏరియాతోపాటు పుష్కర ఘాట్ కు వెల్లే రోడ్లు చెరువులను తలపించాయి.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి..

నిన్న తెల్లవారు జామునుంచి తెరిపివ్వకుండా వర్షం కురుస్తూనే ఉంది..దీంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి..నిర్మల్ జిల్లా బాసరలోని రవీంద్ర పూర్ కాలనీలో వరదనీరు పోటెత్తింది..కొన్ని ఇండ్లలోకి నీరు చేరడం కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు…రోడ్లపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది..ఆదిలాబాద్ జిల్లా మత్తడి వాగు ప్రాజెక్టుకు 9228 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా 3 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇకసాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్ల మరమత్తులు కొనసాగుతున్నాయి..వరద ఉదృతికి దెబ్బతిన్న గేట్ల మరమత్తు నిన్నటి నుంచి కొనసాగుతుంది..కాగా ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో కొనసాగుతోంది..8358 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా మొత్తం 17 గేట్ల ద్వారా అంతే ఔట్ ప్లో పోతుంది..స్వర్ణ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు..ఇన్ ఫ్లో 10 వేల క్యూసెక్కులుండగా 16 వేల క్యూసెక్కులు రెండు గేట్ల ద్వారా కిందకు వదిలిపెట్టుతున్నారు.గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 4 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా ఒక్క గేటు ఎత్తి అంతే నీటిని కిందకు వదిలారు. నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ జీ లో 39.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా కుంటాల లో 27 మిమీ,,వానల్ పహాడ్ లో 26.8 మిల్లీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

Anasuya: జబర్దస్త్‌ షోలో యాంకర్ అనసూయ లాస్ట్ ఎపిసోడ్.. ఏడ్చేసిన జడ్జి ఇంద్రజ

Exit mobile version