గత కొన్ని రోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, భాగ్యనగరంలో ప్రతిరోజూ మద్యాహ్నం సమయంలో వర్షం కురుస్తున్నది. ఈ రోజు కూడా నగరంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లన్నీ తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లొకి వర్షం నీరు చేరుతున్నది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అబిడ్స్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, ఎంజే మార్కెట్, పాతబస్తీలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్పించి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read: మేనమామ.. మేనల్లుడు వరస అయినా తీవ్రస్థాయిలో విమర్శలు !