Site icon NTV Telugu

Heavy Rain in Telangana: నేడు భారీ వర్షాలు.. అప్రమత్తంగా వుండాలని వాతావారణ హెచ్చరిక

Rain

Rain

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న బుధవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఆదిలాబాద్‌, కుమ్రంభీ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

నేడు గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్రంలో 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. కాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షం కురవగా, 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా.. దక్షిణ జార్ఖండ్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్‌ మధ్యభాగం పరిసరాల్లో కొనసాగుతున్నదని వాతవరణ కేంద్రం తెలిపింది. అయితే.. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉన్నదని పేర్కొన్నది.

read also: Goutham Raju : కూర్పు లో భ‌లే నేర్ప‌రి… గౌత‌మ్ రాజు!

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వాన‌తో సింగరేణి జేకే 5 ఓసీ కోయగూడెం ఓసీలలో పనులు నిలిచిపోవడంతో 20 వేల టన్నుల బొగ్గుఉత్పత్తికి ఆటంకంగా మారింది.

Exit mobile version