NTV Telugu Site icon

HYD Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది

Hyderabad Rains

Hyderabad Rains

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దాదాపు రెండుగంటల పాటు వర్షం కురియడంతో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. జంటనగరాల్లో కురిసిన వర్షం వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. భారీ వర్షం కురియడంతో బల్దియా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

YS Jagan: ప్రధానికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. మోడీ చేతికి కోరికల చిట్టా…!

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి వాతావరణం చల్లగానే ఉంది. ప్రతిరోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయ . రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే ఏపీలోనూ రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

Show comments