దేశంలో రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తున్నది. రాత్రి 11 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read: రేపే ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’… ఓ రేంజ్‌లో హైప్!
అంబర్‌పేట మూసీ పరివాహ ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతున్నది. దీంతో పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ ఇళ్లలోకి మురుగునీరు చేరింది. అటు మూసారంబాగ్ వద్ద వంతెనపైనుంచి మూసీనీరు ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు అధికారులు. నాగోల్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అయ్యప్పనగర్ నీటమునిగింది. ఇక, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రికార్డ్ స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదయింది.