రేపే ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’… ఓ రేంజ్‌లో హైప్!

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. అందులో భాగంగానే జూలై 15న ఉదయం 11 గంటలకు ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అని పేరు పెట్టారు. అయితే రేపు రానున్న ఈ సర్ప్రైజింగ్ గ్లిమ్స్ పై మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ‘రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్’ పై సినీ అభిమానులు ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ మేకింగ్ వీడియోపై హైప్ క్రియేట్ అయింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-