హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. దాదాపుగా గంటకు పైగా నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్ కాలనీ, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, మాదాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.
Read: కాదంబరి కిరణ్ ఉచిత ఆంబులెన్స్ సేవలు
ఇక పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి కొనసాగుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజులపాటు తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది.