Site icon NTV Telugu

Hyderabad Rain: హైదరాబాద్ లో వాన జల్లులు.. తడిసి ముద్దయిన నగరం

Telangana Rains Today

Telangana Rains Today

Hyderabad Rain: హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురుస్తుంది. నగరంలోని అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్ని, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్‌, కైపర, ఈసీఐఎల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి నగరంలో మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లగా మారింది. దీంతో కాసేపటికే నగరానికి మేఘాలు కమ్ముకున్నాయి. కాగా.. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి వాన కురుస్తుంది. చలితో వణుకుతున్న భాగ్యనగర వాసులకు వాన పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షం కురుస్తుంది.

Read also: Alia Bhatt: ట్రెండీ డ్రెస్‌లో హీటెక్కిస్తున్న అలియా భట్..

పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలికపాటి తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించిన విషయం తెలిసిందే. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుంచి కొన్ని చుక్కల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది.

పగటి ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదని, రాత్రి కూడా చలి తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి నేటి నుంచి ఈ నెల 26 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు, మంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశలో గంటకు 8 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 79గా నమోదైంది.

Exit mobile version