NTV Telugu Site icon

Munugodu By Poll: బుకీలపై పోలీసులు కన్ను.. అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగులు

Munugode By Poll Mony

Munugode By Poll Mony

Munugodu By Poll: ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తిష్టవేరు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్‌ నడుస్తోంది. భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాయడానికి వచ్చిన బుకీలు చాపకింద నీరులా మునుగోడులో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పందాలు వేసుకుంటున్నారు. అయితే.. డబ్బు లావాదేవీలను కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకునే అవకాశముండటంతో ఆన్ లైన్ ద్వారా యూపీఐ పేమెంట్స్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటిఎం ద్వారా ట్రాన్సాక్షన్‌లు ఫాలో అవుతున్నారు కేటుగాళ్లు.. అభ్యర్థులు ఎవరు గెలుస్తారన్న దానిపై బెట్టింగ్ లు జోరందుకున్నాయి. బెట్టింగుల కోసం కారులు తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును సీజ్ చేశారు. కారు ఎవరిది, వ్యక్తులను ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే.. దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన బుకీలో ఐపీఎల్‌ తరహాలోనే మునుగోడు గెలుపు.. ఓటములపై జూదం నిర్వహించేందుకు భాగ్యనగరంలోని త్రీ స్టార్, టూ స్టార్‌ హోటళ్లలో దిగిపోయారు. ఈనేపథ్యంలో.. వారిచేతికి మట్టి అంటకుండా నగదు ప్రత్యక్ష బదిలీలు జరపకుండా మునుషులు కనిపించకుండా కోట్లలో పందాలు నిర్వహిస్తున్నారు. ఇక,బెట్టింగ్ విషయంలో అన్నీ చోట్ల జరిగినట్లుగా కాకుండా మునుగోడు ఎన్నిక విషయానికి వచ్చే సరికే కొత్త ఫార్ములాను ఆచరిస్తున్నారు.

Read also: Theft In Apple Company: అట్టుంతది మనతోటి.. ఏడేళ్లుగా ఎవరికీ తెలియకుండా రూ.140కోట్లు కొట్టేసిండు

ఇక..మునుగోడు లో మేమంటే మేమె గెలుస్తామని ధీమాతో ఉన్నారు అభ్యర్థులు. మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అయినప్పటికి ఫలితం కోసం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణకు దగరలో ఉన్న ఒక జిల్లాలో మునుగోడు ఫలితాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇవాళ పోలింగ్‌ ముగిసాక ఫలితాలకు మరో రెండు రోజులు టైమ్ ఉండటంతో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రూ.లక్షల్లో హవాలా డబ్బులు పట్టుకున్నారు పోలీసులు. బెట్టింగ్ ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో
Vikarabad Accident: వికారాబాద్‌ ఘటన.. మృతులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌