NTV Telugu Site icon

Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు హైకోర్టులో విచారణ

Telagnana High Cort

Telagnana High Cort

Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. హైకోర్టు నిర్ణయం పై 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.. కాగా.. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరిన తరుణంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కాగా.. ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఇవాల (18)న వాయిదా వేసింది. ఈ పిటిషన్ వెనుక ఎన్‌ఐటీయూసీ రాజకీయం ఉందని ఏఐటీయూసీ ఆరోపించింది. అయితే తాము చేసినవన్నీ చేసి పరువు తీస్తున్నారని ఏఐటీయూసీపై ఎన్‌ఐటీయూసీ నేతలు మండిపడ్డారు. దీనిపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. వారి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. తాజా పిటిషన్‌తో సింగరేణి ఎన్నికలు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? లేక మరో వాయిదా అనే చర్చ సింగరేణిలో నడుస్తోందా? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నేపథ్యంలో 27న జరగనున్న ఎన్నికలపై హైకోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read also: Dawood Ibrahim : ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం

కాగా 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్ల క్రితమే నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి, ఎన్నికల నిర్వహణపై నాలుగేళ్లుగా హైకోర్టులో వివాదం నడుస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు వేర్వేరు కారణాలతో ఎప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు జోక్యంతో అక్టోబర్ 30న నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ కూడా ఎన్నికలకు సిద్ధమై సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగింది. నామినేషన్లు, ఉపసంహరణలు, మార్కుల కేటాయింపు తర్వాత కొన్ని కార్మిక సంఘాలు మళ్లీ సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మరియు ఎన్నికల నిర్వహణ కారణంగా, గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని అభ్యర్థించారు. డిసెంబర్ 27న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఫుల్ బెంచ్ సూచించగా.. ఆర్ఎల్సీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసన్ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించారు. ఈ నెల 27న ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి కోర్టును ఆశ్రయించడంతో సింగరేణిలో గందరగోళం నెలకొంది.
YSR Argoyasri: నేటి నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..