Site icon NTV Telugu

MLC Kavitha Petition: నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణ

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించారని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను కవిత గతంలో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కవిత పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ, సీబీఐ నుంచి నోటీసులు అందాయి. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కవిత సీబీఐ, ఈడీకి లేఖలు రాశారు.

Read also: PM Modi: సౌత్ ఇండియాపై బీజేపీ నజర్.. మూడు రాష్ట్రాల్లో ప్రధాని సూడిగాలి పర్యటన..

ఈనేపథ్యంలో మద్యం కేసులో కవిత గతేడాది మార్చిలో ఈడీ ఎదుట పలుమార్లు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ ఆమెను సాక్షిగా విచారించింది. తాజాగా కవితను లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 41ఏ కింద విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు సమన్లు వచ్చాయి. దీంతో కవిత మళ్లీ సీబీఐ, ఈడీ ఎదుట హాజరుకావాలా వద్దా అనే అంశంపై ఇవాల్టి సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈకేఎస్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు.

Bihar : నేడు నితీష్ మంత్రివర్గ విస్తరణ.. జేడీయూ పూర్తి జాబితా ఇదే

Exit mobile version