NTV Telugu Site icon

RSS Rally: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Rss

Rss

RSS Rally: నిర్మల్‌ జిల్లా భైంసాలో అర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నిర్మల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరణపై ఆర్ఎస్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం రూట్ మ్యాప్ ను కోర్టు కు సమర్పించాలని పిటిషనర్ ను కోరింది. ఆర్టికల్ 19 ప్రకారం సభలు, ర్యాలీలు ఎవరైనా నిర్వహిచవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే లా అండ్ అడర్ సమస్య వల్లే అనుమతి నిరాకరించామని నిర్మల్‌ జిల్లా పోలీసులు తెలిపారు ర్యాలికి మినహాయించి సభకు అనుమతి ఇచ్చేదుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Read also: BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై

ర్యాలీకి అనుమతి ఇస్తే శాంతి భద్రత సమస్య వస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే ర్యాలీకి అనుమతి నిరాకరించామని స్పష్టం చేశారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ఆర్ ఎస్ ఎస్ ర్యాలీ వల్ల 15 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం భైంసాలో ఆర్ ఎస్ ఎస్ ర్యాలీకి అనుమతి పై 2:30 కు హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. అయితే హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉల్కంఠ నెలకొంది. అనుమతి ఇస్తుందా? అనే ప్రశ్నలు ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాల్లో ప్రశ్నార్థకంగా మారాయి. ఒకవేళ ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతి ఇస్తే పోలీసులకు కష్టాలు తప్పవని భావిస్తున్నారు భైంసా ప్రజలు. మరి దీనిపై మధ్యాహ్నం హైకోర్టు తీర్పు ఏమి రానుందో వేచి చూడాలి.
Bandi sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. డేట్‌-టైమ్‌ ఫిక్స్‌ చెయ్, నేను రెడీ

Show comments