NTV Telugu Site icon

DH Srinivas Rao: ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొడుతున్నాయి..

Dh

Dh

ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మండిపడ్డారు. NHM కింద ఉన్న 2nd ఏఎన్ఎమ్ ల సమస్యలను అర్థం చేసుకొని మాట్లాడాలని కోరాము.. 5వేల 1వంద మంది సెకండ్ ఏఎన్ఎమ్ లు తెలంగాణలో వివిధ సేవలు అందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 60 శాతం కేంద్ర నిధులతో వీరికి వేతనాలు అందిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. వీళ్ళను పర్మినెంట్ చేయడం కుదరదు.. వీరికి పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించే అవకాశం ఉందన్నాడు.

Read Also: Karnataka: ఆలయ నిధులపై నిషేధం.. సర్క్యులర్‌ వెనక్కి తీసుకున్న సర్కార్

14 వందలకు పైగా పోస్టులకు నవంబర్ 2వ వారంలో పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశాము అని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మరో 4 నుంచి 5 వందల పోస్టులను కలిపి నవంబర్ లోనే పరీక్ష నిర్వహిస్తామన్నారు. అయితే 5 వేల మందిలో కొంత మంది వయోపరిమితి అయిపోయింది.. సర్వీస్ లో ఉన్న వారికి 20 మార్కులు వేయిటేజీ ఉంటుంది.. దాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఏఎన్ఎమ్ లు ఇంకా చాలా సమస్యలు చెప్పారు.. వాటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ రావు చెప్పారు.

Read Also: Tomatoes: కొండదిగిన టమోటా ధర.. రేపటి నుంచి చీప్‌గా..!

ప్రభుత్వం తరపున సెకండ్ ఏఎన్ఎమ్ లకు విధుల్లోకి చేరాలని కోరుతున్నాము అని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేని వేతనం సెకండ్ ఏఎన్ఎమ్ లకి తెలంగాణ సర్కార్ ఇస్తుంది అని ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే 48 గంటల్లో 2nd ఏఎన్ఎమ్ లు విధుల్లో చేరకపోతే శాఖ
పరమైన చర్యలు తప్పవు అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించాడు.