Site icon NTV Telugu

Komaram Bheem: విషాదం.. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Head Constable Died

Head Constable Died

కొమరంభీం జిల్లా‌లో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్‌కు చెందిన దయానంద్ కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం డ్యూటీలో ఉన్న అతడికి సడెన్‌గా ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తోటి సిబ్బందికి చెప్పాడు. నొప్పితో బాధపడుతున్న అతడిని తోటి సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దయానంద్ మరణించిన వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే దయానంద్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Exit mobile version