NTV Telugu Site icon

Ranga Reddy Crime: చికెన్‌ కోసం వెళ్లాడు.. ప్రాణాలు కోల్పోయాడు..

Ranga Reddy Crime

Ranga Reddy Crime

Ranga Reddy Crime: అతివేగం ప్రమాదకరం అని రోడ్డులపై ప్రమాద సూచికలు పెట్టినా అవి బోర్డుమాత్రమే పరిమితం అవుతున్నాయి. అతివేగంగా వాహనాలను నడిపి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తొందరగా రావాలనే తాపత్రయంతో లేక త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో మృత్యు ఒడికి జారుకుంటున్నారు. ఆదివారం కుంటుంబం కోసం చికెన్‌ తీసుకువచ్చేందుకు బయలు దేరాడు. ఇంట్లో వండుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా తిందామని అనుకున్నాడు. ఉదయాన్నే లేచి చికెన్‌ కోసం బైక్‌ పై వెళ్లాడు. అయితే ఓ ఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసింది. చికెన్‌ కోసం
బైక్‌ పై వెలుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఆటో వేగంగా ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో చోటుచేసుకుంది.

Read also: Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా..? మీరు మోసపోయినట్లే..?

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరమైసమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరాడు. అటుగా వస్తున్న ఆటో అంజి బైక్‌ ను బలంగా ఢీకొట్టింది. దీంతో అంజి కింద పడ్డాడు. బలంగా తలకు గాయం కావడంతో అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి కారణం అయిన ఆటోను ధ్వంసం చేసారు. రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం మితిమీరిన వేగమే అంటున్నారు.
Potato Peels : బంగాళాదుంప తొక్కే కదా అని తీసేస్తే..?

Show comments