Site icon NTV Telugu

Arrest Two for Transport Ganja: హైదరాబాద్ లో రూ. 2 కోట్ల విలువైన గంజాయి సీజ్

Arrest Two For Transport Ganja

Arrest Two For Transport Ganja

Arrest Two for Transport Ganja: హైదరాబాద్‌ లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రటైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను హయత్‌ నగర్‌ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర, చంద్రేశ్ లను అదుపులో తీసుకున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మారెడ్మళ్ళి నుండి ఛత్తీస్ ఘడ్ కు రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో హయత్‌నగర్ లోని జేసింది జంక్షన్ వద్ద పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు రెండు కోట్లు రూపాయల వుంటుందని తెలిపారు. వారి వద్దనుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రధాన నిందితుడు తూర్పు గోదావరి జిల్లా కు చెందిన పెంటారావు పరారీలో ఉన్నాడని అన్నారు. అతను పాత కేసుల్లోనూ నిందితుడని తెలిపారు. ఏపీలో ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని, సుమారు పదివేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని అన్నారు.

Read also: Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. డే కేర్ సెంటర్ కాల్పుల్లో 31 మంది మృతి

అయితే.. ఇటీవల గంజాయి తరలిస్తున్న నలుగురుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, కొబ్బరి బొండాల ముసుగులో కొబ్బరి బొండాల ముసుగులో ఒడిస్సాలోని మల్కన్ గిరి నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా ఎల్బీనగర్.. ఆలేరు ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. అయితే.. ఈ గంజాయి విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మహారాష్ట్రకు చెందిన యోగేష్ దత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మల్కన్ గిరి నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. కాగా.. ఒడిస్సా రాష్ట్రంలో కేజీ గంజాయిని 2 నుంచి 3 వేల రూపాయలకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలో సుమారు రూ.15 వేలకు అమ్ముతున్నారని చెప్పారు.
CP Mahesh Bhagwat: షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్.. అదుపులో అంతర్‌ రాష్ట్ర నేరస్తులు

Exit mobile version