Harish Rao: బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ భేటీ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం హరీష్ రావు, ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. కాగా.. సభలో మీరు కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని అనడంతో బీఆర్ఎస్ వాకౌట్ చేసిందన్నారు. ఇదే విషయంపై ఎంఐఎం కూడా వాక్ ఔట్ చేసిందని హరీష్ రావు తెలిపారు. సభ పని దినాలు… అజెండా పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని నిరసన తెలిపామన్నారు. సభ గంటన్నర పాటు కొనసాగిందన్నారు. శుక్రవారం వరకు సభ ఉండే అవకాశం ఉందని అన్నారు. మేము 15 రోజులు సబ పెట్టాలని అడిగామన్నారు. వాళ్ళు నాలుగైదు రోజులే నడిపే మూడ్ లో ఉన్నారని హరీష్ రావు తెలిపారు.
Read also: Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..
మమ్మల్ని సలహాలు మాత్రమే ఇవ్వాలని సీఎం అన్నారని తెలిపారు. ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్ కు చెప్పామన్నారు. బీఏసీ పెట్టకుండానే బిల్స్ ఎలా పెడతారు అని అడిగామన్నారు. పెళ్ళిళ్లు ఉన్నాయని సభ పెట్టక పోవడం ఏంటని అడిగామన్నారు. కనీసం 15 రోజులు ఈసారి సభ నడపాలని బీఆర్ఎస్ నుంచి అడిగామని హరీష్ రావు తెలిపారు. ప్రతిరోజూ జీరో అవర్ పెట్టాలని అడిగామన్నారు. టీషర్ట్ లతో ఎందుకు రానియ్యలేదు అని గట్టిగా అడిగామన్నారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ టీషర్ట్ లతో వెళ్ళాడు కదా అని గుర్తు చేశామన్నారు. బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: వారు మాట్లాడితే తప్పుకాదా?.. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ చిట్ చాట్