Harish Rao : రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ మ్యూసీ నదికి గోదావరి నీళ్లు తీసుకువెళ్తామన్న వ్యాఖ్యలపై హరీష్ రావు ప్రశ్నించారు. “మరి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకువెళ్తారో ముందుగా సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌కు కావాల్సింది కాళేశ్వరం జలాలే” అని అన్నారు. కాళేశ్వరం కూలడం కాదు, సీఎం రేవంత్ రెడ్డి మైండ్ దొబ్బింది అంటూ హరీష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Harish Rao : రేవంత్ రెడ్డి ఓ చేతకాని ముఖ్యమంత్రి
కాళేశ్వరంపై చర్చకు నేను రెడీ.. కానీ సీఎం వస్తారా? లేక పీసీసీ చీఫ్‌గా వస్తారా? ముందుగా నిర్ణయించుకోవాలి అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ రంగనాయక సాగర్‌లో నడిచే పంపులు కూడా కాళేశ్వరంలో భాగమే కాదా? దీనికి సమాధానం చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. వరద నీటిని ఒడిసి పట్టకుండా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి సీఎం బురద రాజకీయాలు చేస్తున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు.
Ganesh Chaturthi Online Permission: గణేష్ ఉత్సవాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు.. ఇలా చేస్తే చాలు..!
