Site icon NTV Telugu

Harish Rao : నేడు యాదాద్రి జిల్లాలో హరీష్‌రావు పర్యటన

Harish Rao

Harish Rao

యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు బీబీనగర్‌లోని ఎయిమ్స్ దవాఖానను మంత్రి హరీష్‌ రావు సందర్శిస్తారు. 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌లో ఆధునీకరించిన పీడియాట్రిక్ కేర్ యూనిట్ (DPCU)ను మంత్రి హరీష్‌ రావు ప్రారంభిస్తారు.

అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ సేవల విభాగం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు మంత్రి హరీష్‌ రావు. అలాగే.. మధ్యాహ్నం 12.15 గంటలకు భువనగిరిలోని వీకేర్ హాస్పిటల్ (ఫిజియోథెరపీ, డయాగ్నోస్టిక్)ను మంత్రి హరీష్‌ రావు ప్రారంభిస్తారు. 12.30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్‌ రావు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Exit mobile version