Siddipet: దివ్యాంగులకు గత ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్.. జిల్లాలో కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకి 6 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని వికలాంగుల పక్షాన ప్రభుత్వాన్ని హరీశ్ రావు కోరారు.
Read Also: Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక వికలాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్నారు అని హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 400, 700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదు అని విమర్శించారు. కొంత మంది మానసిక దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి వారు నా దృష్టిలో మనుషులే కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. మానసిక దివ్యాంగుల అవసరాల కోసం నా జీతం నుంచి కొంత ఆర్థిక సాయం చేస్తాను.. కంటి సమస్యలు పరిష్కారం అయ్యేలా సిద్దిపేటలోనే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని ఏర్పాటు చేశాం.. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.. అభయ జ్యోతి శాశ్వత భవన నిర్మాణానకి తన వంతు సహకారం అదజేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.