NTV Telugu Site icon

Minister Harish Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణకి అవార్డులే అవార్డులు

Harish Rao Speech

Harish Rao Speech

Harish Rao Speech In Sangareddy Public Meeting: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణకు అవార్డులే అవార్డులు వచ్చాయని.. ఆయన అన్ని భాగాల్లో మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని మంత్రి హరిష్ రావు కొనియాడారు. సంగారెడ్డిలోని పటాన్‌చెరులో సీఎం కేసీఆర్‌తో కలిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందని అన్నారు. పటాన్‌చెరులో దాదాపు రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ని నిర్మిస్తున్నామన్నారు. దీంతో.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. వచ్చే ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణం చేసి, అందుబాటులోకి తీసుకోస్తామని పేర్కొన్నారు. పటాన్‌చెరులో గల్లీగల్లీ తిరిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అని.. ఆయనకు 56 ఇంచుల ఛాతి లేదు కానీ, ఎక్కడ ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు అని వ్యాఖ్యానించారు.

CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం

ఆనాడు కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులోని పరిశ్రమలలో పవర్ హాలిడేలు ఉండేవని.. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ కోతలు లేవని హరీష్ రావు పేర్కొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు కరెంట్ లేదు? అని ప్రశ్నించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజి ఇస్తామని మాటిచ్చిన కేసీఆర్.. ఆ హామీని నెరవేర్చారన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో 4 లక్షల ఎకరాలకు నీరు వస్తుందన్నారు. NIMZ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి, జిల్లా యువతకు ఉపాధి కలిస్తామన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో 70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయన్నారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రమే.. 81 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీలు అవుతున్నాయని ఉద్ఘాటించారు. మన పిల్లల చదువులకు ఉక్రెయిన్, రష్యాకి పోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?