NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణ హెల్త్ హబ్‌గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి

Jakkanna Harish

Jakkanna Harish

Harish Rao Says Telangana Becomes Health Hub: తెలంగాణ రాష్ట్రం హెల్త్‌ హబ్‌గా, హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా అభివృద్ది చెందాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అది సాధ్యమైందని చెప్పారు. బంజారాహిల్స్‌లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆసుపత్రిని దర్శకధీరుడు రాజమౌళితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అన్నారు. 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకల్ని ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని.. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

Animal: వైలెంట్ అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇదేందయ్యా ఇది..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం దవాఖానాలు, కార్పొరేట్‌ ఆసుపత్రులతో పోటీపడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30 శాతం ఉంటే.. గత నెలలో అవి 70 శాతానికి చేరుకున్నాయన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లోనూ తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా ఉందన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. వంద శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నామని చెప్పారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు తోడ్పాటు అందించాలని, వాటి వల్ల అనేక ఇబ్బందులుంటాయని అన్నారు. ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని.. కానీ నేడు అది రివర్స్ అయ్యిందని పేర్కొన్నారు.

Supernova: విశ్వంలో భారీ నక్షత్రం పేలుడు.. “సూపర్ నోవా”ను గుర్తించిన జపాన్ శాస్త్రవేత్తలు

ఇదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళిపై హరీశ్‌రావు కామెంట్స్ చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని రాజమౌళి ప్రపంచవ్యాప్తం చేశారని.. బాహుబలితో కీర్తి దేశవ్యాప్తంగా చేస్తే, RRRతో ప్రపంచ వ్యాప్తం చేశారని కొనియాడారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ MNJ కేన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ వంటి విషయాల వ్యయం రెండేళ్లపాటు తామే భరిస్తామని ముందుకు వచ్చారన్నారు. రాజమౌళి సినిమాల్లో ఇన్స్‌పిరేషన్, దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుందని అన్నారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు మాట్లాడిన రాజమౌళి.. హరీశ్ రావు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట నియోజక వర్గం ఎంతో అభివ్రుది చెందిందని, తాను చూసిన నాటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. హరీశ్‌రావు పనితీరు చూసినప్పటి నుంచి.. తాను ఆయనకు పెద్ద అభిమానిగా మరానన్నారు.

Jakkanna Harish Rao

Show comments