Supernova: విశ్వంలో భారీ నక్షత్రం పేలుడు.. “సూపర్ నోవా”ను గుర్తించిన జపాన్ శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supernova: ఈ విశ్వం ఎన్నో అద్భుతాలకు నెలువు. కొన్ని కోట్ల గెలాక్సీలు, అందులో కొన్ని వందల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఇలా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అయితే ప్రతీ నక్షత్రానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. అయితే నక్షత్రాల చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతలా అంటే దాని విస్పోటనం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కనిపిస్తుంటుంది. అంత విధ్వంసకర రీతిలో ఈ నక్షత్రాల మరణం ఉంటుంది.
Read Also: Netherlands: బీచ్‌లో సెక్స్.. నెదర్లాండ్స్‌లోని ఓ పట్టణంలో వ్యతిరేకంగా ప్రచారం..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజాగా ఇలాంటి ఓ భారీ నక్ష్రత్రానికి సంబంధించిన విస్పోటనాన్ని జపాన్ శాస్త్రవేత్తల బృందం అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ సహాయంతో గుర్తించారు. నక్షత్రం పేలుడు తర్వాత సూపర్ నోవాను గుర్తించారు. 13,824 అడుగుల ఎత్తులో హవాయిలోని మౌనా కీపై ఉన్న భారీ, ఎనిమిది మీటర్ల (26 అడుగుల కంటే ఎక్కువ) వెడల్పు గల జెమినీ నార్త్ టెలిస్కోప్ ఈ అంతరిక్ష పేలుడును గమనించింది. ‘‘SN 2023ixf’’గా పిలువబడే సూపర్నోవాను మే 19న జపాన్ ఖగోళ శాస్త్రవేత్త కొయిచి ఇటగాకి కనుగొన్నారు. గత 5 ఏళ్లలో శాస్త్రవేత్తలు గుర్తించిన అత్యంత సమీపంలోని సూపర్ నోవా ఇదే. పిన్ వీల్ గెలాక్సీ(మెస్సియర్ 101) స్పైరల్ ఆర్మ్స్ లోని ఒక నక్షత్రం పేలి సూపర్ నోవాగా మారింది.
2011లో గమనించిన టైప్ 1 సూపర్ నోవా తర్వాత గత 15 సంవత్సరాలత్లో మెస్సియర్ 101లో సంభవించిన రెండవ సూపర్ నోవా ఇదే. పిన్‌వీల్ గెలాక్సీ భూమి నుండి సుమారు 21 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉర్సా మేజర్ రాశి దిశలో ఉంది. రాత్రి పూట కనిపించే అతి తక్కువ గెలాక్సీల్లో ఇది ఒకటి. ఈ గెలాక్సీ దాదాపుగా 1,70,000 కాంతి సంవత్సరాల వ్యాసంతో ఉంది. దాదాపుగా ఒక ట్రిలియన్ నక్షత్రాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత నెలలో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూసిన దాంట్లో అతిపెద్ద కాస్మిక్ పేలుడును గుర్తించారు. ఈ సంఘటన భూమకి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. మూడేళ్ల పాటు ఇది కొనసాగింది. ఇది మనకు తెలిసిన సూపర్ నోవా కన్నా పది రెట్లు ప్రకాశవంతంగా ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!