Harish Rao: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి హరీష్‌రావు లేఖ. ఏపీ బదలాయించిన రూ.495 కోట్ల సీఎస్‌ఎస్ నిధులు తిరిగి ఇప్పించాలని లేఖ. ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదని.. ఇప్పటికైనా స్పందించి సీఎస్‌ఎస్ నిధులు తెలంగాణకు తిరిగి ఇప్పంచాలని హరీష్‌రావు పేర్కొన్నారు. ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా, పొరపాటున మొత్తం సిఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందన్నారు.
Read also: Thieves in Girls Hostel: గర్ల్స్ హాస్టల్ లో దొంగలు పడ్డారు.. తరువాత ఏం జరిగిందంటే..
తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెల్లిందన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రూ. 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై అనేక సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశామని చెప్పారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు పొరబాటున విడుదల చేసిన రూ.495 కోట్ల మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో వెల్లడించారు మంత్రి హరీష్ రావు. మరి దీనిపై కేంద్ర మంత్రి ఇప్పుడైనా స్పందిస్తారా? లేదా? అనే విషయమై ఉత్కంఠగా మారింది.
Revanth Reddy: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిదర్శనం