NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు

Harish Rao Starts Choutuppa

Harish Rao Starts Choutuppa

Harish Rao Inaugurate Dialysis Centre In Choutuppal: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. చౌటుప్పల్‌లో 5 పడకల డయాలసిస్‌ను ప్రారంభించిన ఆయన.. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 5 పడకల డయాలసిస్‌ను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లో క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలోనే మార్గదర్శకంగా నిలబడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాలు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ పర్యటకు వచ్చినప్పుడు.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చికిత్స చూసి మెచ్చుకున్నారని, తెలంగాణ తరహాలోనే తమిళనాడులోనూ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్‌లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని నొక్కి వక్కాణించారు.

Pushpa: ఆమిర్, ప్రభాస్ రికార్డులని బ్రేక్ చేసిన పుష్ప, నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్

తెలంగాణ ఏర్పడిన తర్వాత 50 లక్షల డయాలసిస్ పెన్షన్లను పూర్తి చేశామని హరీశ్ రావు చెప్పారు. ఒక సంవత్సరానికి ఒక డయాలసిస్ సెంటర్ నిర్వహణకు వందకోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని హామీ ఇచ్చారు. మెడికల్, పీజీ సీట్లను పెంచి.. ఎంబిబిఎస్ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నామన్నారు. నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో ఉద్యోగ కోర్సులు కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్‌లో ఒక ఎయిమ్స్ ఆసుపత్రి ఇస్తామంటే.. తాము ఐదు కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అయితే అక్కడ ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలను సైతం కేంద్రం కల్పించలేదని విమర్శించారు. భువనగిరి ఎయిమ్స్‌లో ఎమర్జెన్సీ సేవలు, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లు, గర్భిణులకు కావాల్సిన సేవలేవీ లేవన్నారు. ఒకే సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా.. మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌‌దేనని హరీశ్ రావు పేర్కొన్నారు.

Balayya vs Chiranjeevi: డల్లాస్‌లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ