Harish Rao Gives Another Good News To Women: తెలంగాణ మంత్రి హరీశ్ రావు మహిళలకు మరో కానుక ప్రకటించారు. వడ్డీ లేని రూ.750 కోట్ల రుణాన్ని మహిళా దినోత్సవం రోజున విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని తెలిపారు. వీఓఏలకు కూడా త్వరలోనే శుభవార్త చెప్తామన్న ఆయన.. ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్‌లో ఉన్న ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మహిళా దినోత్సవం రోజున 100 మహిళా ఆస్పత్రులను ప్రారంభిస్తామని, ప్రతి మంగళవారం మహిళ సమస్యల మీద మహిళా డాక్టర్లు వైద్యం చేస్తారని తెలియజేశారు.
Harish Rao : అక్క, చెల్లెళ్లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతకుముందు.. సంగారెడ్డిలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్, అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కాచెల్లెలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల తల్లులకు కేసీఆర్ ఓ వరం అయ్యారన్నారు. కళ్యాణలక్ష్మితో పెళ్లికి ఆదుకున్నాడని, ఆరోగ్య లక్ష్మితో బిడ్డ కడుపులో ఉండగానే పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్‌తో డెలివరీ కాగానే కిట్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 1600 కాన్పులైతే, అందులో కేవలం 200 కాన్పులు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రల్లో అయ్యాయన్నారు.
Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే
శ్రీ రామనవమి నుంచి న్యూట్రిషన్ కిట్ ఇస్తామని, తల్లికి అవసరమైన పౌష్టికాహారాన్ని ఈ కిట్‌లో ఇస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. 6 లక్షల మందికి ఈ కిట్ అందజేస్తామన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో తాగడానికి మంచి నీళ్లు దొరికేవి కావని, నీళ్ల కోసం బావుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇంటి దగ్గరికే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అన్నారు. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మహిళలకు చదువు చెప్పిస్తున్నారన్నారు. కరోనా వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 10 కిలోల ఉచిత బియ్యం ఇచ్చారని, వృద్ధులను పెద్ద కొడుకులాగా కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు.