Site icon NTV Telugu

Harish Rao : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao

Harish Rao

Harish Rao : రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్ వరద ప్రాంతాలను పర్యటించి ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర కష్టాల్ని ఎదుర్కొనడం ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందని హరీశ్‌రావు అన్నారు. సీఎం ప్రవర్తన ఆయన హోదాను కూడా తగ్గించేలా ఉందని వ్యాఖ్యానించారు.

బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు అందించాలని, అలాగే నదీ నాళాల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో హరీశ్‌రావు, బహిరంగంగా కాంగ్రెస్ కండువ మార్చి పార్టీకి చేరలేదని, అలా చెప్పడం సిగ్గు తెప్పించేదని అన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక సదుపాయాలను కల్పించాలని, పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పాలన సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు.

GST 2.0 : ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలకు ఊరట.. 28 నుంచి 18%కి రేటు కట్, ఫెస్టివల్ సేల్స్ బూస్ట్

Exit mobile version