NTV Telugu Site icon

Harish Rao : ఈ ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంది

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు. అయితే నేడు గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామంలో 129 మందికి దళిత బంధు లబ్దిదారులకు మంత్రి హరీష్‌ రావు మంజూరు పత్రాలు, యూనిట్‌లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం క్రింద ఒక్కొ లబ్దిదారుడికి రూ.10 లక్షలు అందజేసిన ఘటన సీఎం కేసీఆర్‌కే దక్కుంతుందని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ద‌ళితులు వ్యాపార వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు.

పార్టీల‌కు అతీతంగా ప్ర‌తిప‌క్ష పార్టీల కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసి యూనిట్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని ఆయన వెల్లడించారు. విద్య‌, ఉద్యోగాల్లోనే కాకుండా ప్ర‌భుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్ట్‌ల‌లో సైతం ద‌ళితుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని ఆయన తెలిపారు.డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి రోజున ద‌ళిత‌బంధు ల‌బ్ధిదారుల‌కు యూనిట్లు అంద‌జేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.