Harish Rao : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమ్మిట్‌ను ఆయన ‘గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్’ అంటూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు ఆరోపించారు. “రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు.? ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం,” అని ఆయన అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆయన విమర్శించారు.
Akhanda 2: ‘అఖండ 2’ ఎఫెక్ట్‌తో మారిన సినిమాల ఫైనల్ రిలీజ్ డేట్‌లివే!
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్మసిటీ కోసం సేకరించిన భూములను ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పరిశ్రమలకు కట్టబెడుతోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మసిటీ ఏర్పాటు చేసి ఉంటే ఎంతో మందికి ఉద్యోగాలు లభించేవని ఆయన గుర్తు చేశారు. డొల్ల పెట్టుబడులు, గ్రౌండ్‌కు కాని ప్రాజెక్టులు.. ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడులన్నీ ‘పేపర్ల మీద మాత్రమే’ ఉన్నాయని, అందులో ఒక్కటి కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం లేదని హరీష్ రావు అన్నారు. గతంలో దావోస్ సమ్మిట్ గురించి కూడా ఇలాగే చెప్పారని, కానీ ఒక్కటి కూడా వాస్తవ రూపంలోకి రాలేదని ఆయన పాత ఉదాహరణలను ప్రస్తావించారు.
సమ్మిట్ కోసం 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5,000 మంది విదేశీ ప్రతినిధులు, ప్రధాని, రాష్ట్రపతి, రాహుల్ గాంధీ వస్తున్నారని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అందులో ఎవరూ రాలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. “మీరు వేసిన కుర్చీలు నిండకపోతే, చివరికి ఏం చేశారో తెలుసా? గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన ఉద్యోగులను, డీఎస్పీ ట్రైనీలను, పోలీస్ ట్రైనీలను తెచ్చి కోర్ట్లు వేసి కూర్చోబెట్టారు. ఇది ఎంత పరువు తీసిన విషయమ”ని ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
అదే సమయంలో, సదస్సుకు ఆహ్వానించబడిన అతిథులు బీఆర్‌ఎస్ పాలనను ప్రశంసించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ బీఆర్‌ఎస్ పాలన చాలా బాగుందని, ఆ 10 ఏళ్లలో రాష్ట్ర జీఎస్‌డీపీ మూడంతలు పెరిగిందని, తలసరి ఆదాయం పెరిగిందని అద్భుతంగా ప్రశంసించారని తెలిపారు. మాజీ ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక రంగ నిపుణులు సుబ్బారావు కూడా బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనను ప్రశంసల వర్షంతో ముంచెత్తారని హరీష్ రావు పేర్కొన్నారు.
రూ.1,44,000 పైగా భారీ తగ్గింపుతో Sony BRAVIA 3 Series 75 అంగుళాల 4K Google TV..!
