NTV Telugu Site icon

Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్.. కారణం ఇదీ..

Harish Rao Uttamkumar Reddy

Harish Rao Uttamkumar Reddy

Harish Rao: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్ చేశారు. రైతులకు సాగునీటి కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలని కోరారు. మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1.50 టి ఎం సి నీటిని పంప్ చేయాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదలకు మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిచారు. అయ్యప్పస్వామి స్వర్ణాభరణ అలంకరణలో హరీష్ రావు పాల్గొన్నారు. అంతకు ముందు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు వెళ్లారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట క్లీన్‌సిటీ అవార్డు సాధించేందుకు కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండుగ కావడంతో మున్సిపల్‌ కార్మికులను నూతన వస్త్రాలతో సత్కరించారు.

Read also: Kodi Pandelu: ఏపీలో జోరుగా కోడి పందాలు..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు సిద్దిపేటకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశంలోని 4,477 మున్సిపాలిటీల్లో పరిశుభ్రతలో సిద్దిపేట 9వ స్థానంలో నిలిచి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సిద్దిపేటకు ఇంత గౌరవం వచ్చిందంటే మున్సిపల్ కార్మికులు, ప్రజల సహకారమేనని, సిద్దిపేటకు అవార్డు రావడం రాష్ట్రానికే దక్కిన గౌరవమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రశంసలు అందకపోవడం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటపై ఈ ప్రభుత్వానికి ఉన్న పట్టుకు ఇదే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోయినా సిద్దిపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. సిద్దిపేట పేరు లేకుండా అసలు జాతీయ అవార్డు లేదన్నారు.. ఈ అవార్డుతో ఇప్పటి వరకు సిద్దిపేటకు లభించిన అవార్డుల సంఖ్య 23 అని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులు, సామాజిక వైద్యులని హరీశ్ రావు కొనియాడారు.
IndiGo Flight: ముంబై ఎయిర్ పోర్టులో గందరగోళం.. ఏరోబ్రిడ్జ్‌పై ఇరుక్కుపోయిన హీరోయిన్ రాధికా ఆప్టే

Show comments