Site icon NTV Telugu

Father Apologizes: నవీన్‌ కుటుంబానికి హరిహర కృష్ణ తండ్రి క్షమాపణలు..

Father Apologizes

Father Apologizes

Father Apologizes: ఓ అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలు.. హత్యకు దారి తీసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసులో నిందితుడు సైకో హరిహరకృష్ణ గురించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన లవర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో.. తన క్లోజ్ ఫ్రెండ్‌ను అతికిరాతకంగా చంపిన హరికృష్ణ.. అనంతరం శరీరంలోని భాగాలను వేరు చేసిన తీరు చూస్తుంటే.. అతను ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడో తెలుస్తోంది. అయితే, హరిహర కృష్ణ తండ్రి మాత్రం.. నవీన్‌ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెబుతున్నారు.. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్‌.. అమ్మాయి ట్రాప్ లో పడి ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి.. ఒకరు చనిపోతే మరొకరు జైలు పాలయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. హరిహర కృష్ణ శివరాత్రి పండుగ రోజున వరంగల్ కు వచ్చాడు.. ఆరోజు ఎక్కువ ఫోన్లు వచ్చాయి.. ఏదో అలజడిగా ఉన్న తీరు గుర్తించి ఏం జరిగిందంటే ఏమీ లేదు అంటూ వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్లిపోయాడని.. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదన్నారు.. ఇక, అప్పటికే నవీన్ కనపడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.. మా అబ్బాయి కూడా కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు.

Read Also: Off The Record: మంత్రి తానేటి వనితకు అసమ్మతి సెగ..! సొంత సామాజికవర్గం నేతలే దూరం..!?

ఇక, హరిహర కృష్ణ మళ్ళీ 23వ తేదీన వరంగల్ వచ్చాడని తెలిపారు ప్రభాకర్‌.. ఆ రోజు ఏం జరిగిందని నిలదీస్తే నవీన్ కి హరిహర కృష్ణ మధ్య గొడవ జరిగినట్టు చెప్పాడు.. ఈ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని సూచించానన్నారు.. మట్టెవాడ పోలీసుల దగ్గరికి తీసుకెళ్దామంటే.. రేపు హైదరాబాదులోనే పోలీసులకు లొంగిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడని.. నిన్న హైదరాబాదులో పోలీసుల దగ్గర లొంగిపోయాడని తెలిపారు. అయితే, తప్పు చేసింది ఎవరైనా తప్పు తప్పే.. కానీ, అమ్మాయిల ట్రాప్ లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని వేడుకుంటున్నాం అన ప్రభాకర్‌.. హరి హర కృష్ణ, నవీన్‌ ఇద్దరు ఇంటర్ నుంచి మంచి స్నేహితులే.. కానీ, ఒక అమ్మాయి మూలంగా ఇద్దరు జీవితాలు పాడైపోయాయంటూ కన్నీరుమున్నీరయ్యారు హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్‌.

Exit mobile version