Fit Ness Gym: జిమ్‌లో మైనర్ బాలికపై వేధింపులు.. శరీర భాగాలు తాకుతూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fit Ness Gym: జిమ్ పేరుతో ఓ ట్రైనర్ మైనర్ బాలికను వేధింపులకు గురిచేశాడు. ఫిట్ నెస్ కోసం రోజూ వస్తున్న ఆ బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమెతో ఫోటోలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ బాలిక ఫిట్ నెస్ చేస్తుండగా రహస్యంగా ఫోటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగక ఆమైనర్ బాలికను బ్లాక్మెయిల్ చేయసాగాడు. తాము అడిగిన డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. లేకుంటే తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ మైనర్ బాలిక ఇంట్లో నుంచి డబ్బులు తీసుకు వచ్చిన అతని చేతికి ఇచ్చింది. ఫోటోలు తీసి వేయాలని కోరింది అయినా జిమ్ ట్రైనర్ వినకుండా పదే పదే డబ్బులు అడుగుతుండటంతో గత్యంతరం లేకి ఆమైనర్ బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిమ్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు మైనర్ బాలిక బంధువులు. ట్రైనర్ ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బోయిన్ పల్లి పి.ఎస్ పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ లో చోటుచేసుకుంది.
Read also: Payal Rajput: టవల్ చుట్టుకుని సెల్ఫీ ఏంటమ్మా.. పొట్టి నిక్కర్‌తో..
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పి.ఎస్ పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు జిమ్ నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితం వ్యాయామశాలకు వచ్చిన మైనర్ బాలికను మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు నటించాడు. ఆమెతో దిగిన ఫోటోలు మార్ఫింగ్ చేసిన జిమ్ ట్రైనర్ రాజు.. ఆమె ఫిట్నెస్ చేస్తుండగా ఆమె శరీర భాగాలను తాకుతూ ఉన్న ఫోటోలను రహస్యంగా తీసి ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు, నగదు తీసుకురావాలని బాలికను వేధించాడు. దీంతో ఆఫోటో బయటకు వస్తే తన పరువు పోతుందనే భయంతో ఆ మైనర్ బాలిక 20 తులాల బంగారం, 4 లక్షల నగదు తెచ్చి ట్రైనర్ రాజుకు ఇచ్చింది. మళ్లీ డబ్బులు కావాలని వేధించడంతో.. కుటుంబ సభ్యులకు రాజు గురించి వివరించింది. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులో తీసుకున్నారు. జిమ్ సెంటర్ కు తాళం వేశారు. అయితే.. జిమ్ సెంటర్ ముందు మైనర్ బాలిక బంధువులు ఆందోళన చేశారు. రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Acidity: కడుపులో మంటగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!