NTV Telugu Site icon

Fit Ness Gym: జిమ్‌లో మైనర్‌ బాలికపై వేధింపులు.. శరీర భాగాలు తాకుతూ..

Fit Ness Gym

Fit Ness Gym

Fit Ness Gym: జిమ్‌ పేరుతో ఓ ట్రైనర్‌ మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేశాడు. ఫిట్‌ నెస్‌ కోసం రోజూ వస్తున్న ఆ బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమెతో ఫోటోలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ బాలిక ఫిట్‌ నెస్‌ చేస్తుండగా రహస్యంగా ఫోటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగక ఆమైనర్‌ బాలికను బ్లాక్‌‌మెయిల్ చేయసాగాడు. తాము అడిగిన డబ్బులు తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే తన ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ మైనర్‌ బాలిక ఇంట్లో నుంచి డబ్బులు తీసుకు వచ్చిన అతని చేతికి ఇచ్చింది. ఫోటోలు తీసి వేయాలని కోరింది అయినా జిమ్‌ ట్రైనర్‌ వినకుండా పదే పదే డబ్బులు అడుగుతుండటంతో గత్యంతరం లేకి ఆమైనర్‌ బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిమ్‌ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు మైనర్‌ బాలిక బంధువులు. ట్రైనర్‌ ను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన బోయిన్ పల్లి పి.ఎస్ పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ లో చోటుచేసుకుంది.

Read also: Payal Rajput: టవల్‌ చుట్టుకుని సెల్ఫీ ఏంటమ్మా.. పొట్టి నిక్కర్‌తో..

హైదరాబాద్‌ లోని బోయిన్ పల్లి పి.ఎస్ పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు జిమ్‌ నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితం వ్యాయామశాలకు వచ్చిన మైనర్ బాలికను మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు నటించాడు. ఆమెతో దిగిన ఫోటోలు మార్ఫింగ్ చేసిన జిమ్ ట్రైనర్ రాజు.. ఆమె ఫిట్నెస్ చేస్తుండగా ఆమె శరీర భాగాలను తాకుతూ ఉన్న ఫోటోలను రహస్యంగా తీసి ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు, నగదు తీసుకురావాలని బాలికను వేధించాడు. దీంతో ఆఫోటో బయటకు వస్తే తన పరువు పోతుందనే భయంతో ఆ మైనర్‌ బాలిక 20 తులాల బంగారం, 4 లక్షల నగదు తెచ్చి ట్రైనర్‌ రాజుకు ఇచ్చింది. మళ్లీ డబ్బులు కావాలని వేధించడంతో.. కుటుంబ సభ్యులకు రాజు గురించి వివరించింది. మైనర్‌ బాలిక కుటుంబ సభ్యులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులో తీసుకున్నారు. జిమ్‌ సెంటర్‌ కు తాళం వేశారు. అయితే.. జిమ్ సెంటర్ ముందు మైనర్ బాలిక బంధువులు ఆందోళన చేశారు. రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
Acidity: కడుపులో మంటగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి..

Show comments