Site icon NTV Telugu

Hanuman Shobha Yatra: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Hanuman Jayanti

Hanuman Jayanti

హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్రకు అంతా రెడీ అయింది. హనుమాన్ జయంతి సందర్భంగా… ఇవాళ హైదరాబాద్‌లో భారీఎత్తున శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామాలయం నుంచి ప్రధాన శోభాయాత్ర ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ తాడ్ బండ్ లో ఉన్న హనుమాన్ ఆలయం దగ్గర శోభాయాత్ర ముగుస్తుంది. మొత్తం 12 కిలోమీటర్లు శోభాయాత్ర సాగనుంది. అలాగే కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మరో శోభాయాత్ర ప్రారంభమై కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ దగ్గర ప్రధాన శోభాయాత్రలో కలవలనుంది..

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి ఎక్స్‌రోడ్స్‌, ఆంధ్రా బ్యాంక్‌ ఎక్స్‌రోడ్స్‌, కోఠి, తిలక్‌రోడ్‌, సుల్తాన్‌బజార్‌, రాంకోఠి, కాచిగూడ ఎక్స్‌రోడ్స్‌, నారాయణగూడ, చిక్కడపల్లి ఎక్స్‌రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, వైస్రాయ్‌ హోటల్‌, ప్రాగా టూల్స్‌, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్‌, బైబుల్‌ హౌస్‌, సిటీ లైట్‌ హోటల్‌, బాటా షోరూం, ఉజ్జయినీ మహంకాళి ఆలయం, రామ్‌గోపాల్‌పేట్‌ పీఎస్‌, ప్యారడైజ్‌ ఎక్స్‌రోడ్స్‌, సీటీవో జంక్షన్‌, రాయల్‌ లీ ప్యాలెస్‌, బ్రూక్‌ బాండ్‌, ఇంపీరియల్‌ గార్డెన్‌, మస్తాన్‌ కేఫ్‌, తాడ్‌బండ్‌లోని శ్రీహనుమాన్‌ ఆలయానికి చేరుకోనుంది.. అదేవిధంగా, కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయం నుంచి వస్తున్న మరో ర్యాలీ చంపాపేట్‌ ఎక్స్‌రోడ్స్‌, ఐఎస్‌ సదన్‌, దోబిఘాట్‌, మలక్‌పేట్‌ ఏసీపీ ఆఫీస్‌, సైదాబాద్‌ కాలనీ రోడ్డు, సరూర్‌నగర్‌ ట్యాంక్‌, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, మూసారాంబాగ్‌, నల్లగొండ క్రాస్‌రోడ్డు, చాదర్‌ఘాట్‌ నుంచి కోఠి డీఎం అండ్‌ హెచ్‌ జంక్షన్‌ వద్దకు చేరుకొని అక్కడ ప్రధాన ర్యాలీలో కలవనుంది..

ఇక, హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు… కర్మాన్‌ఘాట్‌ నుంచి కోఠి వరకు, గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సమయంలో నగరంలోని 21 మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మల్లింపులు ఉంటాయని అధికారులు ప్రకటించారు.. గౌలిగూడ నుంచి శోభాయాత్ర ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగుస్తుందని, ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. శోభాయాత్ర సందర్భంగా… హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. దిల్‌సుఖ్ న‌గ‌ర్ నుంచి మెహిదీప‌ట్నం వెళ్లే వాహ‌న‌దారులు ఎల్బీన‌గ‌ర్, ఉప్పల్, తార్నాక‌, సికింద్రాబాద్ లేదా ఎల్బీన‌గ‌ర్, చాంద్రాయ‌ణ‌గుట్ట, ఆరాంఘ‌ర్, అత్తాపూర్ మీదుగా మెహిదీప‌ట్నం చేరుకోవ‌చ్చు. ల‌క్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేష‌న్ లేదా ఉప్పల్ వెళ్లే వాహ‌న‌దారులు.. సోమాజిగూడ‌, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లై ఓవ‌ర్, ప్రకాశ్ న‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్, పార‌డైస్ ఫ్లై ఓవ‌ర్ మీదుగా సికింద్రాబాద్, ఉప్పల్ చేరుకోవ‌చ్చు. కాగా, హనుమాన్‌ జయంతి సందర్భంగా నగరంలో బార్లు, మద్యం దుకాణాలు బంద్‌ చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. 8 వేల మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శోభాయాత్ర జరిగే రూట్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని… సీసీ కెమెరాలు, డ్రోన్లతో శోభాయాత్రను పర్యవేక్షిస్తామన్నారు.

Exit mobile version