హనుమాన్ జయంతి విజయ యాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విహెచ్‌పీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం చారిత్రాత్మక గౌలిగూడ రాంమందిర్ నుండి నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.
ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్, కార్తికేయ , జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, విశ్వ ప్రసాద్ , ఏవీ రంగనాథ్ , డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐ లు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, భిక్షపతి లు రాంమందిర్ లో పూజలు నిర్వహించిన అనంతరం శోభయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించి పలుసూచనలు చేశారు.
Read Also:Liquor: మందుబాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు బంద్
భజరంగ్ దళ్, విహెచ్ పీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.రూట్ ను పరిశీలించడానికి గౌలిగూడ నుండి సికింద్రాబాద్ తాడ బండ్ హనుమాన్ దేవాలయానికి ప్రత్యేక బస్సులో అధికారులు తరలివెళ్లారు. మరోవైపు హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ లో ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్స్ బార్స్, రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీచేశారు.
Hanuman route map