Hanumakonda: రోడ్డు ప్రమాదం.. 20 మంది కూలీలకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

  • హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • కమలాపూర్ మండలం గూడూరు శివారులో ఆర్టీసీ బస్సు- టాటా ఏస్ వాహనం ఢీ
  • కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం
  • 20 మంది కూలీలకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
  • క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలింపు.
Wgl Road Accident

Wgl Road Accident

హన్మకొండ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం మండలం గూడురు శివారులో ఆర్టీసీ బస్సు- టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌లో వెళ్తున్న 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. అందులో డ్రైవర్తో సహా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ దగ్గర మిర్చి తోట ఏరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం ఈ ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు.