NTV Telugu Site icon

Minister Ponguleti: దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు..

Ponguleti

Ponguleti

Minister Ponguleti: హనుమకొండ జిల్లా దేవన్నపేట దగ్గర దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు.. అందుకే చర్చ లేని సమయంలో.. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారు అని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే.. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.. కమీషన్ల కోసం శిలా ఫలకాల కోసమే కొత్త ప్రాజెక్టులు తెచ్చారు.. దేవాదులను నిర్లక్ష్యం చేశారు ఆరోపించారు.

Read Also: Ranya Rao: దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. స్నేహితుడితో దుబాయ్‌కు 26 ట్రిప్పులు

ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుకున్న దాని కంటే రైతులు ఎక్కువ సాగు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల పంటల ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం.. బడ్జెట్ సమావేశాల కంటే రైతుల సమస్యలే ముఖ్యమని వచ్చాం.. ఎంత పొద్దుపోయినా పంపు ఆన్ చేసి వెళతాం.. నాటి ప్రభుత్వం దేవాదుల పూర్తి చేసి ఉంటే రైతులకు ఈ స్థితి వచ్చేది కాదు అన్నారు. ఇక, అంచనా వ్యయం పెరగడానికి కూడా కేసీఆర్ నిర్లక్ష్యమే కారణం.. తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని ఆరోపించారు. ఒక లిఫ్టుతో ఆపరేట్ చేసినా 60-70 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరేది.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు.. : Ponguleti Srinivas Reddy | Ntv