NTV Telugu Site icon

Hanamkonda: ముస్లిం అమ్మాయితో మాట్లాడిన హిందూ యువకుడిపై దాడి..

Hanmakonda

Hanmakonda

Hanamkonda: హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హిందూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే.. ముస్లిం అమ్మాయితో మాట్లాడాడు అనే సాకుతో న్యూ శాంపేట్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు కొందరు మైనార్టీ యువకులు. అయితే, నిన్న (ఆదివారం) మధ్యాహ్నం హనుమకొండ చౌరస్తా ఐస్ మ్యాజిక్ ఎదురుగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర యువకుడిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని పలు ప్రాంతాలలో తిప్పుతూ సదరు యువకుడి పైనా దాడికి దిగారు మైనార్టీ యువకులు.

Read Also: Mumbai: ఏక్‌నాథ్‌షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా‌ ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి

ఇక, బాధితుడు సాయి చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన హనుమకొండ పోలీసులు 12 మంది ముస్లీం యువకులపై కేసు నమోదు చేశారు. అయితే, ముస్లిం యువతులతో ఎవరైనా మాట్లాడితే వారిపై ఈ ముఠా దాడులకు దిగుతోందని బాధితుడు ఆరోపించాడు. కాగా, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని సాయి చరణ్ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు కఠిమైన శిక్ష పడేలా చూడాలని వేడుకుంటున్నారు. ఇక, గాయపడిన సాయి చరణ్ ను స్థానిక హస్పటల్ కి తరలించారు.