NTV Telugu Site icon

Satyavathi Rathod: గవర్నర్‌కు మంత్రి బహిరంగ లేఖ.. ఏ విధంగా అండగా ఉంటారో చెప్పాలి

Satyavathi Rathod To Tamili

Satyavathi Rathod To Tamili

Minister Satyavathi Rathod Letter To Governor Tamilisai: రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి మంత్రి సత్యవతి రాథోడ్ బహిరంగ లేఖ రాశారు. ఉగాది ఉత్సవాల సమయంలో తెలంగాణ యువత అనేక సవాళ్ళు ఎదుర్కొంటుందని గవర్నర్ వ్యాఖ్యానించడం విచారకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి గడ్డుకాలమన్న విషయాన్ని గవర్నర్ గ్రహిస్తే మంచిదని సూచించారు. తెలంగాణపై కేంద్రం చూపే వివక్షతను గవర్నర్ గమనించాలన్న ఆమె.. రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే గవర్నర్ సహకరించాలని కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా ప్రభుత్వం అంటూ గొప్పగా చెప్పిన గవర్నర్.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు పొగడుతూనే.. మరోవైపు విషం చిమ్మడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు అడ్డుపడ్డవారు వస్తే క్షణాల్లో అపాయింట్మెంట్ ఇస్తారని.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వరా? అని నిలదీశారు. రాజ్ భవన్ యువతకు అండగా ఉంటుందని గవర్నర్ అనడం సంతోషకరమైన విషయమని.. అయితే ఏ విధంగా అండగా ఉంటారో చెప్పాలని కోరారు. గవర్నర్ పదవికి కలంకం తెచ్చే విధంగా తమిళిసై వ్యవహరించకూడదని తాను కోరుతున్నానని అన్నారు.

Lottery: లాటరీలో రూ.2.9 కోట్లు.. ఆ మహిళ చేసిన పనికి భర్త షాక్!

తెలంగాణ యువ‌త ఉద్యోగ, ఉపాధి, విద్య అవ‌కాశాల‌పైన వివ‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖ‌రిపైన గ‌వ‌ర్నర్ గ‌ళ‌మెత్తాలని మంత్రి సత్యవతి సూచించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాల‌తో త‌మ‌కు జ‌రుగుతున్న న‌ష్టాన్ని ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నారని.. నీళ్లు, నిధులు, నియామ‌కాలు అమ‌ల‌య్యేలా సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. 2.30 ల‌క్షల ప్రభుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసుకుంటున్నామని.. 22 ల‌క్షల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేలా పారిశ్రామిక విధానాన్ని తీర్చిదిద్ది, పెట్టుబ‌డుల గ‌మ్యస్థానంగా మార్చుకున్నామని చెప్పారు. ఐటీ రంగంలో దేశానికే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను దెబ్బకొడుతూ విద్యాసంస్థల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క న‌వోద‌య పాఠ‌శాల‌ గానీ, ఒక్క మెడిక‌ల్ కాలేజీ గానీ కేటాయించ‌లేదన్నారు. ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించే విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను సైతం కేంద్రం ప‌క్కన పెట్టిందన్నారు. యూనివ‌ర్సిటీ కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును తొక్కిపెట్టిన విష‌యం మ‌రిచిపోయిన‌ట్లు ఉన్నారని గుర్తు చేశారు.

Bhatti Vikramarka: మోడీ, కేసీఆర్‌కి బుద్ధి చెప్పడం కోసమే నా పాదయాత్ర