Bhatti Vikramarka : రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణ పనులను దశలవారీగా వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణ ప్రక్రియలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
రోడ్ల రూపకల్పనలో ట్రాఫిక్ సర్వేలను పరిగణనలోకి తీసుకోవాలని, రోడ్లు ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ ప్రాజెక్ట్ మొదటి దశకు సంబంధించిన టెండర్లను అతి త్వరలో పిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణం పారదర్శకంగా, నాణ్యతతో కూడిన విధంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. అధికారులు, శాఖ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
