Site icon NTV Telugu

Telangana Rain: నేడు, రేపు వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచన

Etalana Rains

Etalana Rains

Telangana Rain: నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రేపు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల హెచ్చరిక జారీ చేశారు.

Read also: CPI Ramakrishna : ప్రథమచికిత్సకు పూర్తిస్ధాయి గుర్తింపు అవసరం

రేపు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 11 నుంచి 13వ తేదీ వరకు వర్షాలు కురిసే సూచనలున్నాయి. నిన్న జోగులాంబ గద్వాల్ జిల్లాలో 45.6, నారాయణపేట జిల్లాలో 44, వనపర్తి జిల్లాలో 36.4, నల్గొండ జిల్లాలో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న అత్యధికంగా ఖమ్మంలో 43.6 డిగ్రీలు, అత్యల్పంగా హయత్‌నగర్‌లో 22.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది. నేడు కూడా పలు జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇక హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40, కనిష్ట ఉష్ణోగ్రత 27, మెదక్ గరిష్ట ఉష్ణోగ్రత 41.4, కనిష్ట ఉష్ణోగ్రత 26, నల్గొండ గరిష్ట ఉష్ణోగ్రత 42.5, కనిష్టంగా 25.2, రామగుండం గరిష్టంగా 42.6, కనిష్టంగా 28.4, ఆదిలాబాద్ గరిష్టంగా 42.8, కనిష్టంగా 30.5, భద్రాచలంలో 42.2 కనిష్ట ఉష్ణోగ్రతలు 43.2గా నమోదయ్యాయి. , 28.5 హనుమకొండ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Rs.2000Note : రూ.2,000 నోటుపై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

Exit mobile version