Guvvala Balaraju : బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు రాజీనామా

  • బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు రాజీనామా
  • కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపిన గువ్వల బాలరాజు
  • ఈనెల 9న బీజేపీలో చేరనున్న గువ్వల.
Guvvala Balaraju

Guvvala Balaraju

Guvvala Balaraju : భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి పెద్ద షాక్‌గా మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. సోమవారం తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

Windows in shopping Mall: షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?.. అసలు కారణం ఇదే!

×
×
Ad

“మన నాయకత్వంలో నేర్చుకున్నాను, ఎదిగాను, సేవ చేసాను. పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను,” అని గువ్వల తెలిపారు. అలాగే, “నా మిషన్ మాత్రం కొనసాగుతుంది – చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడం నా లక్ష్యం,” అని స్పష్టం చేశారు.

గువ్వల బలరాజు తన రాజీనామా వెనుక ఎటువంటి నిందలు లేవని, కేవలం గౌరవం , కృతజ్ఞతతోనే పార్టీకి వీడ్కోలు చెబుతున్నానని చెప్పారు. “ఇది బాధతో కూడిన రాజీనామా – కానీ పార్టీ పట్ల నా గౌరవం మారదు,” అని తుది వాక్యంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 9న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు.

Film Chamber : ఛాంబర్ సంచలన నిర్ణయం.. ఇక ఎవరితో అయినా షూటింగ్ చేసుకోవచ్చు!