Site icon NTV Telugu

Gutha Sukhender Reddy: రాజకీయలబ్ధికే బీజేపీ ఆరోపణలు

రాజకీయ లబ్ధికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యం అన్నారు గుత్తా.

రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోంది.. ఎప్పుడు ఎటు కొట్టుకుపోతుందో వారికే తెలియదు. బీజేపీకి అభ్యర్థులు లేరు…కాంగ్రెస్ పార్టీలో రోజూ తన్నులాటే…2023లో అధికారంలోకి రావడం ఖాయమని ఎలా చెబుతారు. బీజీపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటుంది. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని విమర్శించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

https://ntvtelugu.com/bandi-sanjay-open-letter-to-cm-kcr-on-farmers/
Exit mobile version