NTV Telugu Site icon

Gutha Sukender Reddy: పాదయాత్ర చేసిన భట్టినే ఖమ్మం సభలో పక్కకు నెట్టారు

Gutta Sukhender Reddy

Gutta Sukhender Reddy

Gutha Sukender Reddy: కర్ణాటక ఫలితాల తర్వాత దేశంలో, రాష్ట్రంలో అధికారం లేని కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోంది శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా తన నివాసంలో మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే కారణమని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపాలనే దురాలోచనతోనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే విజయవంతంగా అమలు అవున్నాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తాం అని చెప్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మేము సమైఖ్యoగా ఉన్నామని చెబుతూనే క్రమశిక్షణ లేకుండా 1400 కిమీ పాదయాత్ర చేసిన భట్టిని ఖమ్మం సభలో పక్కకు నెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Gold Royal Enfield: బంగారంతో బుల్లెట్ బైక్.. స్పెషల్ అట్రాక్షన్ గా శివాజీ స్టాచ్యు

ఆదివారం జరిగిన జనగర్జన సభ ముగిశాక రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు రూ.4 వేల పింఛన్ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. రాహుల్ గాంధీతో కలిసి వేదిక ప్లకార్డును ప్రదర్శించేందుకు వీరంతా పోటీపడ్డారు. ఈ సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భట్టి విక్రమార్కకు మోచేయి వేశారు. వీరి మధ్యకు మరొకరు రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. వేదికపై ప్లకార్డు ప్రదర్శిస్తూ కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క మధ్య గొడవ జరిగింది. కోమటిరెడ్డిని పక్కకు తప్పుకోవాలని భట్టి కోరారు. ఇంతలో మరో నాయకుడు వెనుక నుంచి తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కోమటిరెడ్డి భట్టి విక్రమార్కను మోచేతితో బలంగా నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఇదేనా కాంగ్రెస్ నాయకత్వ ఐక్యత అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీనిపై స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులపై సెటైర్ వేశారు.
Samajavaragamana : రెట్టింపు లాభాలతో దూసుకుపోతున్న సామజవరగమన..